సీ!!
కూరగాయలసాటి యారోగ్యమిచ్చున
కూడబెట్టినసొమ్ము నేడనైన
డబ్బుతోమందులు జబ్బుతొలగజేయు
యారోగ్యమెప్పుడు యమ్మబడదు
యారోగ్యమెన్నడు యరువుగతేలేము
సంతలోసరుకుగ సర్దలేము
యారోగ్యమెప్పుడు యంతులేనిధనము
మంచినడతసదా రక్షనీకు!!
ఆ.వె!!
బాల్యమందునీవు బాగుగనారోగ్య
మనుసరించినడువు మనుసుదలచి
వంగదండిమొక్క వంగదూమానయ్యి
బాలప్రాయమందె బాటువడుము!!
---------------------------------------------------
ఆరోగ్య పద్యాలు:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి