ఉదయకాంతుల మెరిసిన
పుడమి పచ్చని చీరకుచ్చెళ్ళు
సవరిస్తున్నట్టు సన్నగ వీచే
పైరగాలి
నింగిలోని నీలమంత
శిఖరాలపై ప్రతిఫలించగా
వంపులెన్నో తిరుగుతూ
జలజలమంటూ జారే
జలపాతాలు.
చెంపలకు పసుపురాసిన
పండుముత్తయిదువలా
కళకళలాడుతూ పండిన
బంతి పువ్వుల పంట
గిరులు తరులు పైర్లు.
పచ్చ పసుపు నీల వర్ణాలు
అవనిపై అందాల హరివల్లు
దిగివిచ్చినట్టు
అందమంతా రాశిపోసినట్టు
కనువిందు చేసే
భువి సౌందర్యం
దివిని మించి పోయెనేమో!
అంతులేని అందాలున్న
పుడమికి.....జీవికనిచ్చే
అరుణుడి ఆగమనంతో
వెలుగులతో మిడిసిపడే
ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి