ఆశ @-కోరాడ నరసింహా రావు
మనిషి ఆశా జీవి... !
  భవిష్యత్తు మీద ఆశ యే... 
  మనిషిని బ్రతికిస్తుంది !
నేటికంటే...రేపుఇంకాబాగుండా లనే,బాగుంటుందనే ఆశచేతనే 
రాతియుగంనుండి మనిషి రాకె ట్యుగానికి చేరుకో గలిగాడు కదూ.... !
   ఆశ మంచిదే... మానవ వికా సానికదెంతగానోసహకరించింది
 దేనికైనా...అతిసర్వత్రవర్జయేత్
అని ఎంత అనుభవం మీద చె ప్పారో గానీ మనపెద్దలు, అది అక్షర సత్యమే ఐంది.. !

 మనిషి  కేవలం ఆ ఒక్క ఆశతో నేఆగలేదుకదా... !
  పేరాశాపరుడై...మనము మన
ము - మనది అనే భావంనుండి 
మేము మాది అనటం మొదలు పెట్టి...ఇంకా స్వార్ధం తో  నేను -
నాది అనుకునే దురాశకు దిగ జారిపోయాడు... !

 దురాశ దుఃఖ హేతువే కదూ !
ఎన్నెన్ని మారణ హోమాలు సృష్టించింది.... !
    కులాలంది,మతాలంది,వర్గాలుగావిభజించేసింది... !  
 పోరాటాలకు దారులు వేసింది 
 రాష్ట్రానికీ - రాష్ట్రానికీ మధ్య 
దేశానికీదేశానికీమధ్య...మొత్తం
భూగోళాన్నే అనిశ్చిత పరిస్థితు లలోనికి  నెట్టేసింది ఈ దురాశ 

మూన్నాళ్లముచ్చటే ఐన జీవి తాన్ని... ఆజన్మాoత విశాదంగా 
మార్చేసింది... !
    
 ఓ మనిషీ... ఇకనైనా మేలుకో 
  ఆశతోనే ఆగిపో... 
    పేరాశకు లోనుగాకు... 
    అదిదురాశగామారిపోతుంది 
   చివరికిదుఃఖాన్నేమిగిలిస్తుంది
       ******

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం