శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సుశ్రూష అంటే సంస్కృతంలో వినాలనే ఇచ్ఛ! కానీ నేడు సేవ గా మారింది.రోగికి సేవా శుశ్రూష చేయటం అనే ప్రయోగం వాడుకలో ఉంది.
శుక్రాచార్యుడు అంటే రాక్షస గురువు సంజీవని విద్య తెలిసిన వాడు.వామనుడు ఈయన ఒక కన్ను పొడిచిన కథ ఒంటికన్ను శుక్రుడు అనే పదం వాడుకలోకి వచ్చింది.ఈయన కూతురు దేవయాని మహామొండి పెంకెఘటం.పాపం తండ్రి ఈమె మాటల్ని కాదనలేని అతి పెద్ద మనసున్న వాడు.
శీర్షికతో అంటే సంస్కృతంలో తల అని అర్థం.కానీహిందీలో తెలుగు లో హెడ్డింగ్.కథ కవిత కి పెట్టేది.
శిష్ట అంటే నేర్పటం అనే అర్థం.చదువుకున్నవారికే గౌరవం విలువ ఇచ్చేవారు.సభ్యత సంస్కారం నిశిష్టాచారం అనేవారు.బుద్ధిమంతుడు ఆజ్ఞాకారి అని అర్థాలు.మరాఠీలో గర్విష్టి పొగరుబోతు అని అర్థం.

కామెంట్‌లు