కుందేలు ఆత్మవిశ్వాసం;-- యామిజాల జగదీశ్
 ఒక కుందేలు ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది.
అందుకు కారణం...
ఓవైపు వేటగాడు వెంటపడి తరుముతున్నాడు....మరొకవైపు కుక్క....మరొకవైపు పులి...ఇలా ఎటువైపు చూసినా కుందేలుకి ప్రాణాపాయమే....
ఇక నేను బతికి ఉండేందుకు అర్హత లేదనుకుంది. ఎలా ఆత్మహత్య
చేసుకోవాలాని ఆలోచించింది.
చివరగా...
కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుందామని కొలను దగ్గరకు వెళ్ళింది.
అప్పుడు కుందేలు రాకకు భయపడికొలను గట్టున ఉన్న కప్పలు కొలనులోకి దూకాయి.
కుందేలు ఆలోచించింది. 
అరెరె...నన్ను చూసీ భయపడే ప్రాణులు ఈ భూమ్మీద ఉన్నాయా అనుకుంది. అంతే ఆ క్షణమే తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ఆత్మహత్య చేసుకోవడానికి దృఢమైన మనసుండాలి. తెగింపూ ఉండాలి... అంతటి మానసిక శక్తీ, తెగింపూ ఉన్నప్పుడు నువ్వెందుకు చావాలి?  బతికి చూడు....అని పదే పదే చెప్పిన అంతరంగానికి కృతజ్ఞతలు చెప్తూ కుందేలు ఆత్మవిశ్వాసంతో హుందాగా బతికింది. తన చాతుర్యంతో ఆపదలను ఎదుర్కొంది.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం