" మీ పల్లెల్లోనూ...ఇంతేనా !";- కోరాడ నరసింహా రావు !
 పండుగ.... పండుగ... అని - ఎదురుచూసిన పండగ.... 
 మేరువులా  వచ్చి.... 
   ఏటినీటిలా... జారిపోయింది!
.   . పట్నంలో  భోగీ.... 
      అక్కడక్కడా... మంటలతో
        పెద్ద హడావుడేమీ... 
        లేకుండానే  ఐపోయింది !!
సంక్రాంతి.... 
     ఎవరిళ్ళలో  వాళ్ళు.... 
          భక్తి - శ్రద్దల్లో   మునిగి...,
           పల్లెల్లో కనిపించే... 
  పసుపుకుంకుమలతో నిండిన 
    ఆడవారి ముఖాలేవీ... 
    కనిపించకుండానే పోయింది!
 డూ.. డూ.. బసవన్నలూ లేవు 
    హరిలో రంగ హారీలు లేవు... 
      కోడి పందాలూ లేవు... 
        ఎడ్ల పందాలూ... లేవు !
       అక్కడక్కడా,ఒకటీ,రెండు 
  గాలిపటాల రెప - రేపలుతప్ప
      
మరే సందడి లేకుండానే... 
సంక్రాంతిసల్లగాఅయిపోయింది
  ఇంక.... రేపు కనుమ.... 
     ఏముంది... మటన్, చికెన్ 
దుకాణాలన్నీ సందడిగానే... 
  ఉంటాయి... !   తప్ప... 
    ఇంకేముంటుంది.... !?
.. ఎవరిళ్ళలో  వాళ్ళు... 
      కామ్గా.... గప్ - చప్ !!
  ఏమైనా.... పండుగల  ఉత్సా హం... మునుపటిలా  లేదు !
..మా పట్నాల్లోనేనా.... 
    మీ పల్లెల్లోనూ  ఇంతేనా !!
          *****

కామెంట్‌లు