పూసిన పూలన్నీ ఫలాలు కానట్లు
వచ్చిన ఆలోచనలన్నీ నిజం కానట్లు
కలలన్నీ నిజం కావు.
ఆ కలలు అన్నీ నీవి కావు!!?
పనిలో కలిసిపోవాలి
ఆలోచనలతో అలసిపోవాలి
మొత్తంగా
బాగా అలసిపోవాలి బాగా నిద్రపోవాలి!!
విశ్రాంతి
మనశ్శాంతి లేకుండా చేస్తుంది
శ్రమను ప్రేమించు ఇంచుమించు
ప్రాణాన్ని జయించు!!?
నీ లోపల ఉన్నది బయట కూడా ఉంటే
నీవు సంతోష పడతావు
లేకుంటే బాధపడతావు.
బయట ఉన్నా లేకున్నా లోపల ఉన్నదే నిజం.
అదే మాట మీద నిలబడితే
లోపల బయట అంతా ఒకటే అవుతుంది!!?
నీకు జనం కావాలనుకుంటే
కిందనే ఉండు
అక్కడ ఎక్కువమంది ఉంటారు.
నీకు విజయం కావాలనుకుంటే
పైన ఉండు
అక్కడ ఎక్కువ జనం ఉండరు!!?!
సహనము -శ్రమ-ఎదురుచూపు
ఎంతో నొప్పి కలిగిస్తాయి
ప్రతి విజయం వెనుక ఈ మూడు ఉంటాయి
కానీ
ఈ మూడు ఉంటే
కచ్చితంగా విజయం వస్తుందని చెప్పలేము.
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి