ఆడగుండె !స్వీయకవిత; -అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్
"అమ్మోయ్!కొత్త ఏడాది అంటే ఏందీ?ఏడ?" బుడ్డోడి ప్రశ్న!

"ఏందిరో! అంత గనంగా అడుగుతుండావు!?
ఆ అమ్మ ఇంట రేత్రంతా సాకిరీ
సీసాలు సీసాలు గలగలలు!
పెయ్య నొచ్చి నేను మూల్గుడు"

"మమ్మీ!హ్యాపీ న్యూఇయర్!
స్కూల్ లో కేక్స్ కట్ కట్!
బెలూన్స్ ఫట్ ఫట్!
సందడే సందడి!"

" హూ!మీ డాడీ జేబుకి చిల్లి!
ఏమన్నా అంటే లొల్లి లొల్లి!
రెండ్రోజులు ముందే బార్లోబాటిల్స్ హాట్ హాట్ కేక్స్
నెలంతా నాజీతంతో ఇల్లు గడవాలి!"

భూమాత కన్నీరు చెమట చుక్కల్లా మంచు నీటి తుంపరలా!
"బుద్ధిలేని జనాలు! భావికి గోతులు! తీస్తారు నా ఉసురు!
కోళ్ల కుత్తుకలు తెగు- తాగుడుతో తూలుతూ రాదారిపై రయ్ రయ్ న వాహనాల పరుగులు!
నాఒడలంతా రక్తపుచారలు!

క్షణం తీరిక లేని పోలీసులు 
డ్యూటీలో పెరిగే చిక్కులు!
సైనికుల కవాతులు! సరిహద్దుల్లో గస్తీలు!
ఏరోజైనా ఒకటే కష్టపడే
బాధ్యతగలవారికి"🌸

కామెంట్‌లు