సీ.
అరిమూకలకుకాల యమునిగాదోచుచు
గగనాన ఖడ్గమై క్రాలుచుండు!
దేశరక్షణజేయు ధీశాలిగానిల్చు
త్యాగశీలురవాక్కు తనువుదాల్చి!
శాంతి సౌరభములకాంతియై యెగిరెడి
పారావతమ్ముగాపరిఢవిల్లి!
హరితార్ణవమౌచుభరతమాతకు ఫాల
తిలకమై మెరసెడితేజరాశి!
తే.గీ.
ధర్మ సంస్థాపనార్ధియైతనరుచుండు
పౌరసంక్షేమగణతంత్ర భారతాన
విమల యశదాయిగానిల్చు విపులలోన
చేతనాత్మక నా జాతికేతనమ్ము!
----------------------------------------
చేతనాత్మక నా జాతికేతనమ్ము;-కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి