పూ తోటలోనీ
సీతాకో చిలుక ఒకటి
అడవిలోకి ప్రవేశించింది!!?
ఆకాశమంత అడవి
ఇంద్రధనస్సు లాంటి
సీతాకోచిలుకను ఆహ్వానించింది!!
ఆ తరువాత ఏం జరిగిందో
ఒకటే వర్షం
నీలంతా నీళ్లతో స్నానం చేసింది!!
మేఘాల నీటి కుండాలన్నీ
పగులగొట్టి
నేల పాలైన కన్నీటిని
రెండు కళ్ళ కడవల కావడిని మోసింది!!?
అడవంత దగ్ధమైపోతున్న
కడుపుకోతలో
మెరుపు అరుపులు
స్మశానాన్ని ధిక్కరిస్తున్నాయి!!
ప్రవేశించడాన్నీ
నిషేధించిన పగలు,
రాత్రిని అడవిలో బంధించింది!!
ఆత్మహత్య చేసుకున్న చీకట్లు
చెట్లకు వేలాడుతున్నవి!!
కళ్ళు తెరిచిన కారడివి
మిట్ట మధ్యాహ్నం
సూర్యుని మింగేసింది
ఆకలి చచ్చిపోయింది!!
చిరుత పులి సింహం ఏనుగు
నాలుగు స్తంభాలాట లో
నాలుగు సింహాల వేట ముగిసినట్లు
అడవి ప్రకటించింది.!!
దూరంగా జరిగిపోతున్న అడవి అంతా
పచ్చని పచ్చి రక్తం పారుతున్నట్లు
మొక్కలన్ని నేల వాలిపోతున్నాయి!!
అడవికి అడ్డంగా నిలబడ్డ
నెమలి ఒకటి
రెండు కాళ్లపై వేలా ఆకాశాల్నీ
పురివీప్పి పూసింది!!
హద్దుల్ని సరిహద్దుల్ని చెరిపి అడవి
తొలి పొద్దుల్నీ
తొలిసారి ప్రసవించింది ఇప్పుడే!!
అడవి ఒంటరిది
జంట కోసం
ఆకాశాన్ని ఆశించింది!!
చివరికి ఒంటరిగానే
మిగిలిపోయింది!!
ఎగురుతున్న జంట పక్షుల
చూపులు ఎప్పటికీ కలవవు
రెక్కలు నరికిన ఆకాశం
ఎప్పటికీ అపరాధిగానే
మిగిలిపోయింది!!!?
అమ్మలాంటి మైభూనాకు ప్రేమతో
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి