సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -24
ఏక నాళ ఫల బాహుళ్య న్యాయము
******
ఏక అంటే ఒక అని అర్థం.నాళము అంటే కాడ అని అర్థం.ఫల అంటే పండ్లు.బాహుళ్య అంటే అధికము అని అర్థం.
ఒకే కాడను  ఆధారముగా చేసుకొని అనేక ఫలములు వ్రేలాడటాన్ని  ఏక నాళ ఫల బాహుళ్య న్యాయము అంటారు.
 కొన్ని కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ  ఏ పనీ పాటా లేకుండా ఆ ఇంటి యజమాని మీదనే మొత్తంగా ఆధారపడుతూ ఉంటారు.
వారు తిండికి బట్టకు ఇబ్బంది పడకుండా వారి అవసరాలకు  కావాల్సిన డబ్బు సంపాదించేందుకు ఆ కుటుంబ యజమాని  రెక్కలు ముక్కలు చేసుకుంటూ అహర్నిశలు శ్రమిస్తుంటాడు.ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే ఇక వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమే.
అలా పండ్లను మోసే కాడకు చీడ పట్టినా, ఏదైనా దెబ్బ తాకినా ,దానికి వేలాడే పండ్లన్నీ ఆధారం కోల్పోయి చెల్లాచెదురై రాలిపోతాయి కదా!.
ఇంటి మొత్తాన్ని పోషించే వ్యక్తి  సమర్థత, సంపాదన మీదనే కుటుంబ స్థితి గతులు ఆధారపడి ఉంటాయనీ, అలా ఒక కాడను ఆధారంగా చేసుకుని  అనేక ఫలాలు వేలాడినట్లు  ఉండే కుటుంబాలను చూసే ఇలాంటి ఏక నాళ ఫల బాహుళ్య న్యాయము వాడుకలోకి వచ్చింది. 
 
ఇలాంటి న్యాయాలన్నీ మన వెనుకటి తరాల నిశిత పరిశీలనకు మచ్చుతునకలు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం