సుప్రభాత కవిత ; - బృంద
గాలి సరాగాలు వింటూ
కొమ్మ ఉయ్యాల లూగే
మరుమల్లె వెదజల్లే పరిమళాలు
ఆస్వాదించే మనసు
పొందే అనుభూతికి
సాటి వుంటుందా?


చీకట్లను చీలుస్తూ....
పదునైన కిరణాల బాణాల
పరంపర కురిపిస్తూ
తూరుపు కొండల మధ్య
వెలిగే దీపాన్ని చూసి
అబ్బురపడని మనసు
ఉంటుందా?

ఆకులన్నీ రాల్చుకుని
సర్వసంగపరిత్యాగిలా మిగిలిన
మోడైనా చిన్ని చిన్ని
చివురులతో నిండైన పచ్చదనంతో
నిలిచి హాయిగా కొత్తగా బ్రతుకు
మొదలెట్టే వృక్షం చెప్పే విషయం
కన్నా గొప్ప పాఠముంటుందా?


నీటినంతా పోగుచేసి
గుండెనిండా మమతలా 
నింపుకుని
కురిపించి మురిపించి
అవసరాలు గమనించే
మబ్బుకన్నా నేస్తం మరోటి
లఉంటుందా??

నీరు దాచిన మబ్బులెన్నో
దాపునే తిరుగుతున్నా
కొంచెమైనా తడి తగలక
పొంగు కుంగులకు అతీతంగా
ఉండాలని నింగి మనకు చెప్పే
హితవు కన్నా పరమార్ధం
వేరేది వుంటుందా?

ఆకు మొగ్గ పువ్వు
కాయ కాండం శాఖ
అన్నీ మనకోసమే ఇస్తూ
ఇవ్వటంలో ఉన్న
సంతోషాన్ని మనకు
తెలియచేసే చెట్టు
కన్నా హితులు వుంటారా?

జగతినంతా చైతన్యపరచి
సకల సృష్టినీ రక్షిస్తూ
క్రమం తప్పక వచ్చే
కరుణామూర్తి  భాస్కరుడికన్నా
ఆప్తులైన మిత్రులుంటారా?

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం