1. అహిన కుల న్యాయం-పాము ముంగిసలువలే, స్వభావ వైరం కలవాలని గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు.
2. కూప స్థ మండూక న్యాయం-బావిలోని కప్ప, ఆ బావే సమస్త ప్రపంచం అనుకుంటుంది. అదేవిధంగా ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు తమకు తెలిసిందే విజ్ఞానమని భావిస్తారు.
3. గత జల సేతు బంధన న్యాయం-నీళ్లు పోయిన తరువాత గట్టు వేస్తే ప్రయోజనం ఉండదు. తగిన సమయంలో కార్యాలు చేయాలి. లేకపోతే వ్యర్ధమవుతుంది.
4. భ్రమర కీటక న్యాయం-తుమ్మెద వెంట తిరుగుతూ ఒక పురుగు, నేను తుమ్మెద నవుతా ననే భావనతో అదే శబ్దాన్ని అనుకరిస్తూ తుమ్మెద వెంట తిరిగి తిరిగి, చివరకు తుమ్మెద గానే మారుతుంది. భావన బలాన్ని సూచించే న్యాయం.
5. మర్కట కిశోర న్యాయం-తల్లి కోతి ఒక చెట్టు పై నుండి మరో చెట్టు పైకి దూకుతుంటే, పిల్లలు దాన్ని గట్టిగా పట్టుకుంటాయి. అది వాటి స్వభావం. ఇది స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. దీన్ని వేదాంతంలో జ్ఞానమార్గానికి ఉదాహరణగా చెప్పారు.
సంస్కృత న్యాయాలు.;-తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి