భగవంతుడు సర్వ వ్యాపకుడు. అణువు నుండి జగత్తు వరకు అంతటా వ్యాపించి వున్నాడు. మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో..“యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః”
..అంటే ‘ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు’ అని ఆయన సర్వ వ్యాపకత్వం గురించి స్పష్టంగా వివరించబడింది.
ఇక ఆశావాశ్యోపనిషత్ లో భగవంతుని సర్వ వ్యాపకత్వం గురించి ఈ విధంగా వివరింపబడింది.…
పరమాత్మ ఒక్కటే చలన రహితమైనది. అయినా మనస్సు కంటే మహావేగము కలది. మనసు కంటే ముందే వెళ్ళుట వలన అది ఇంద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటిపోవుచున్నది. ఆత్మసాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతములగుచున్నవి.
పరమాత్మ అన్ని చోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగా ఉన్నట్లు తోస్తుంది. ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈజీవులన్నియూ చైతన్యవంతములై తమ తమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.
ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వవ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల కూడా ఉన్నది.
మనం పరమాత్మవైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు.
దూరము దగ్గర అనేవి అక్కడకు ఇక్కడకు మధ్య దూరమును సూచిస్తుంది. అప్పుడు ఇప్పుడు అనేది కాలము సూచిస్తుంది. పరబ్రహ్మకు కాలము దూరము లేవు. అంతటా ఉన్న వాడికి అన్ని కాలములలో ఉన్న వాడికి కాలము దూరము ప్రసక్తి లేదు. విశ్వం అంతటా నిండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు.
ఈ పరబ్రహ్మ తత్వము ఎక్కడో లేదు అందరి హృదయములలో అదిష్టానంగా ఉన్నాడు. కాని మనమే తెలుసుకోలేకపోతున్నాము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్ని జీవరాసులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ వినియోగించుకోవడంలేదు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత, వాటి మీదున్న మమకారము, లోపల ఉన్న ఆత్మస్వరూపుడి మీద లేకపోవడమే.
ఈ తత్వాన్ని ఆకళింపు చేసుకొని , నిజ జీవితంలో ఆచరించగలిగినట్లయితే జీవితం ప్రకాశవంతం మరియు ఆనందమయం అవుతుంది. మనం మాట్లాడే ప్రతీ మాట ఒక మంత్రమే అవుతుందన్నది నిర్వివాదాంశం.
సి హెచ్ ప్రతాప్
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
MOBILE no : 95508 51075

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి