నూతన ఆంగ్ల సంవత్సరం 2023 శుభాకాంక్షలతో
++++++++++++++++++++++++++++++++++
1. నీవున్న జార్చుకున్న ,
కాలం గతం !
నేర్చుకో,
నిన్ను చేయు, జాగృతం!
కాలం,
ఆదినుండి మాయా దండం,!
ఇతిహాసం, పరిహాసం,
దాని దరహాసం!
కాలంతో ప్రయాణం,
నిత్యం సాహసం!
2. ప్రతి ,నూతన,
సంవత్సరాన నూతనం!
మన మన(గ)తనం,
పునః నిరూపణం!
అసంభవాలు,
కావాలి సాధారణాలు!
సమస్యలకుండాలి,
సరిసాధనాలు!
సవాళ్లకు చెప్పాలి ,
నిజ సమాధానాలు!
3. జరిగిన కాలానికి,
మూల్యాంకనం!
రాబోయే కాలానికి ,
అవగాహనం!
జీవితం,
విరామం లేని సమరం!
మనిషి సిపాయి,
సదా అప్రమత్తం!
అలసత్వం,
అణువంతయినా నిషిద్ధం!
4. చూడు," కరోనా ",
రూపం మారుస్తోంది!
నేడు, "విశ్వాన ",
భయం ఆవహిస్తోంది!
కీడు, "గతం",
గాయం మచ్చయింది!
మరో,
విశ్వయుద్ధం వణికిస్తోంది!
ధరలో మానవత్వం ,
గొంతు మూగబోతోంది!
5. సంవత్సరాలు అనంత,
వృత్తాలుగా ఆవృతం !
జీవితం ,
సరళరేఖ సూటిగా పయనం!
తెరచాపలా,
తెరచి ఉంచాలి నయనం!
కంటిరెప్ప,
కన్నుమూసిన, ఒక్క క్షణం!
బతుకు రెక్క,
తెగిపడడం. ఖాయం!
_________
నూతనం- మన(గ)తనం!;-డా. పివిఎల్ సుబ్బారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి