సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-19
ఉష్ట్ర కంటక న్యాయము
*****
ఉష్ట్రం అంటే ఒంటె. కంటకము అంటే ముల్లు.
ముళ్ళు గుచ్చుకుంటున్నా ఒంటె ఆ బాధనుండి నేర్పుతో, ఓర్పుతో తప్పించుకుంటూ, ఇబ్బందిని ఇష్టంగా సహిస్తూ జమ్మి ఆకులను గానీ, పల్లేరు కాయలను తింటుంది.అలా ముళ్ళు గుచ్చుకోకుండా  ఒంటె నేర్పుతో తప్పుకుంటూ తినెడి విధమునే ఉష్ట్ర కంటక న్యాయము అంటారు.
బాధలు,కష్టాల నుండి ఒడుపుగా, నేర్పుతో తప్పుకుంటూ సుఖాన్ని, తృప్తిని పొందడాన్ని ఈ న్యాయంతో పోల్చుతారు.
మనిషి కూడా అంతే. ఎంత కష్టమైన పనైనా సరే దాని వల్ల  కొంత లాభము, సంతోషము, తృప్తి కలుగుతుందంటే...
 దానిని చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. ధైర్యంగా, సాహసంతో ముందుకు దూసుకు పోతూ కంటకాల వంటి  ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని ఎంతో నేర్పుతో, ఓపికగా తొలగించుకుని అనుకున్నది సాధిస్తాడు.ఇలాంటి వాటికి ఉదాహరణే ఈ ఉష్ట్ర కంటక న్యాయము.
కొందరు సాహస వంతులు,ప్రయోగశీలురు, సమాజ హితైషులు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ చేస్తుంటారు. అందులో విజయాలను సొంతం చేసుకుంటారు.అందులోనే ఆనందం వెతుక్కుంటూ విజయాలను సొంతం చేసుకుంటారు.
అలాంటి వారికి సరిగ్గా సరిపోతుంది కదండీ! ఈ ఉష్ట్ర కంటక న్యాయం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం