శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 సంథాల్ సంథాలీ జాతి వారు గంగాతీరంలో సామెతలు మైదానంలో ఉండేవారు.సమతల్ అనే పదం నించి సంథాలీ వచ్చింది.ఒకప్పుడు వీరు పాలకులు.ఆర్యులు వీరిని అణిచేశారు.సేద్యం వీరి ప్రధాన వృత్తి.వ్యవసాయసంబంధ పదాలు వీరి భాషలో ఎక్కువగా ఉన్నాయి.
సంత్ అనే హిందీ పదానికి అర్థం అంజలి.ధర్మాత్మా సాధు అని కూడా అంటారు.వ్యావహారికభాషలో ఈశ్వర భక్తుని సాధువు ని సంత్ అంటారు.కామక్రోధాదుల జయించిన వాడు అని అర్థం.సంసార ఈతిబాధలు దుఃఖాలు అంటవు.భగవంతుని చరణకమలాలపై సర్వం అర్పించి తామరాకు పై నీటిబొట్టు లాగా ఉంటాడు.
షడయంత్రం అంటే కుట్ర.హిందీ పదం ఇది.సంస్కృతంలోని షట్ యంత్రం కలిసి ఈపదం ఏర్పడింది.తాంత్రికులు   మాత్రం విశిష్ట ప్రకారం గా  తయారైన యంత్రం గా అంకెలు అక్షరాలతో ఏర్పాటు చేసిన తాయెత్తు ఫలకం గా భావిస్తారు.తాంత్రికుల వశీకరణ యంత్రం ఇలాంటిదే! కుట్ర పన్నటం అనే అర్థం వాడుకలో ఉంది.
షడానన అంటే కుమారస్వామి.
శంకరుని పుత్రుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యస్వామి  ఆరు ముఖాలు న్న వాడు వినాయకుని తమ్ముడు.ఆరుగురు కృత్తికలు పెంచారు ఆబాలుడిని.
షడ్జమం అంటే సంగీతం లో మొదటి స్వరం స.సంగీతశాస్త్రప్రకారం నాసిక కంఠం ఉరము నాలుక దంతాల సమ్మిళితం షడ్జమం.
శ్రోత్రియ అనేపదం బహు ప్రాచీనమైనది.వేదవేత్త అని అర్థం.పవిత్ర అధ్యయనం తో సంపన్నుడైన ఆధ్యాత్మిక గ్నాని బ్రాహ్మణుని శ్రోత్రియుడు అంటారు.అథర్వవేదం ఐతరేయబ్రాహ్మణంలో శతపథ్ లో ఉపనిషత్తులో శ్రోత్రియ పదం వాడబడింది.

కామెంట్‌లు