భాషా మాధుర్య పదాంశాలు;- తాటి కోల పద్మావతి గుంటూరు.

 మనం మాట్లాడే మాటకు బలం చేకూర్చే అంశాలు, పలుకు బళ్ళు, సామెతలు న్యాయాలు, పొడుపు కథలు ఇవన్నీ భాష మాధుర్యంలో భాగాలే.
పొడుపు కథలు పిల్లల మేధస్సుకు పరీక్ష. వాటిని పరిష్కరించడంలో వాళ్ల బుద్ధి పదునెక్కుతుంది. సరైన సమాధానం లభించగానే పిల్లల కళ్ళల్లో వెలుగు తొంగి చూస్తుంది. విజయానంద రేఖ విరబూస్తుంది. కొన్ని పొడుపు కథలు చూడండి.
చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు.
పొడుపు కథ అర్థం.అద్దము.
చక్కనమ్మ చిక్కినా చక్కనే.(సబ్బు).
కళ్ళున్నాయి చూడలేదు. కాళ్లున్నాయి నడవలేదు. (నవారు మంచం).
నేలను నాకి మూల కూర్చుంటుంది. (చీపురు).
అన్నేసి చూచు నన్నేసి చూడు. (ఉప్పు).
ఇలాంటివి సమస్య పరిష్కార దిశగా విద్యార్థుల్ని నడిపిస్తాయి.
శ్రద్ధతోడి విద్యాసాధనకు మార్గమవుతాయి.

కామెంట్‌లు