న్యాయాలు -21
ఊసర వృష్టి న్యాయము
*****
ఊసరము అంటే చౌటి నేల. చౌటి నేలలో ఎంత వర్షం కురిసినా ఫలితం ఉండదు.అందుకే ఈ న్యాయము వాడుకలోకి వచ్చింది.
కారణం ఏమిటంటే చౌడు నేలలో నీరు భూమిలోకి ఇంకదు.పై పొర దృఢంగా వుండటం వల్ల కురిసిన వర్షం నీటిని నేల అంతా పాకనివ్వదు.అందుకే గట్టిగా వుంటుంది.ఇట్లాంటి నేలల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
అలాగే ఊసరం లాంటి మనుషులు కూడా కొందరు ఉంటారు.వాళ్ళపై ఎంత జ్ఞాన వర్షం కురిపించినా ఏమాత్రం మనసులోకి చేరదు.వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు.వారిలోని మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం ఏ మంచి విషయాలను మనసులోకి ఎక్కించుకోనీయదు.
అందుకే ఓ కవి "తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు/ దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు/ తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు" అంటాడు.
అంటే మూర్ఖత్వం అంతగా ఉన్న చవిటి పర్ర లేదా చౌడు భూమి లాంటి మనిషిని విధంగానూ మార్చలేము అని అర్థం.
అలా మన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఇలాంటి వారు తారస పడుతూ ఉంటారు.వారిని ఉద్దేశించి ఈ ఊసర వృష్టి న్యాయమును న్యాయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి