వెన్నెముక! అచ్యుతుని రాజ్యశ్రీ

 సోషల్ టీచర్ పాఠం చెప్పుతూ  పర్యావరణ పరిరక్షణ రైతులు పడే కష్టాలు చెప్పింది.సైన్స్ టీచర్ కూడా పర్యావరణం పంటలగూర్చి చెప్పింది.శివా అడిగాడు"టీచర్! దేశానికి వెన్నెముక రైతు.తాను ఎంతో కష్టపడి ఏడాది పొడుగునా పంటలు పండిస్తున్నాడు.తుఫాన్ వరదలు నీటిసమస్యతో నష్టపోయే రైతుని పట్టించుకోము.వినోదంగా చూసే సినిమా ని ఆకాశం కి ఎత్తేస్తాం.రైతు బువ్వ పెడితే నే కదా కళ్లు?" "అవును.శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ అన్నారు.అసలు రైతులని గూర్చి ఆలోచించినవాడు ఆచార్య వినోబా భావే.బాగా సంపన్న కుటుంబంలో పుట్టి మెట్రిక్ పాసైనాడు.దేశసేవకే నాజీవితం అంకితం అని సర్టిఫికెట్ తగులబెట్టి వారణాసి లో సంస్కృతం వేదాంతంలో దిట్ట ఐనాడు.ఫ్రెంచ్ అరబిక్ జర్మనీ జపనీస్..ఇలా21దేశభాషలు నేర్చాడు ఆయన.తిలక్ ప్రభావం తో జర్నలిస్టు గా మహారాష్ట్ర ధర్మపత్రికను నడిపారు.1953లోవైద్యనాధ్ ఆలయంలో దళితుల కు ఆలయప్రవేశం కల్పించారు.1960లో చంబల్ లోయలో బందిపోటు దొంగలు ఆయన ఎదుట లొంగిపోయారు.తెలంగాణా అంతా పల్లె పల్లెకు తిరిగి నల్గొండ జిల్లాలో పోచంపల్లి కి చెందిన శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన 100ఎకరాల భూదానం స్వీకరించారు.ఆయన తన తల్లి తండ్రుల పేరు మీద దానం ఇచ్చి భూదాన్ పోచంపల్లి అనేపేరు సార్ధకం చేశారు.అదే భూదానోద్యమంకి నాంది.దేశమంతా64వేల కి.మీ.కాలినడకతో13ఏళ్ళు నడిచిన ఆయన ఆదర్శ నిస్వార్థ సంఘసంస్కర్త!
కామెంట్‌లు