మడిపిల్లలకు స్తన్యమిచ్చే అమ్మ
చేపపిల్లల క్రీడా మైదానం
కప్పల గొప్పలు పలికే వేదిక
ఎండ్రకాయల కాళ్ళస్పర్శా స్థలి
ఏటి నీటిని తన పొదుగులో పెట్టుకున్న ఓ గోమాత
కమలాలవలవిసిరి సూర్యుణ్ణి
కలువపూలకళ్ళతో చంద్రుడ్ని
అలల పై తెప్పోత్సవం చేసే
ఓ అందాల జలజవ్వని!
లంబోదరుణ్ణి తన జలగృహంలోకి స్వాగతించే
గంగమ్మ తల్లి!
వేసవిని కసరికొట్టి,పల్లె గొంతులోకిఅమృతాన్ని పోసే
వారి దేవత!
ఊరి పశుగణానికి జలాభిషేకం గావించే ఓ పూజారి!
వేల్పులను తన తాటిపై నిల్పుకున్న ఓ సాంస్కృతిక కేంద్రం!
ప్చ్.....మరినేడు
గుండె ప్లాట్లు ప్లాట్లు గా బద్ధలై మృతిచెందిన అనాథ...
----------------------------------------
మన ఊరి చెరువు;-కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి