కునుకు తీయు రాతిరిని
కుదిపి లేపే వేకువ
కదిలిపోవు ఏటి నీటిని
తట్టి పిలిచే వేకువ
ఎదురు చూచు గగనానికి
ఎరుపు నద్దే వేకువ
పరుగులు తీసే పాలమబ్బులకు
బంగరు మెరుపు లిచ్చే వేకువ
వేచి చూచు మనసులకు
ఉత్సాహం ఇచ్చే వేకువ
మూతపడని కన్నులకు
వెతలు తీర్చే వేకువ
కొండల నడుమ కోటి వెలుగులు
ప్రసరించే వేకువ
పుత్తడి వెలుగులు కొత్తగ తెచ్చి
మెత్తని ఆశల అత్తరు చల్లే వేకువ
మొగ్గలు విచ్చి పువ్వుగ మార్చి
లతలన్నింటినీ నవ్వించే వేకువ
పచ్చని ఆకుల అంచున నిలిచి
మంచు ముత్యాలు మెరిసే వేకువ
కలతల తలుపుల ముంగిట
వెలుగుల ముగ్గులు వేసే వేకువ
సాగే మమతల పయనంలో
మరో రోజును కానుకనిచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి