* అన్నమయ్య సాహితీ పురస్కారం అందుకున్ననెల్లుట్ల సునీత


 అన్నమయ్య సాహితీ సంస్థ ఒంగోలు అన్నమయ్య పురస్కారాలకు డిసెంబర్ నెలలో ప్రకటన ఇవ్వగా ఎంతో మంది కవులు, కవయిత్రులు వారి వివరాలను చేసిన సేవల కార్యక్రమాలను,పోటోలను పోస్టులో పంపగా సెలక్షన్ కమిటీ ద్వారా ఉత్తమ  సాహిత్య రచనలు,సేవలను అందించిన వారిని ఎంపిక చేసి అన్నమయ్య సాహితీ పురస్కారాలు అందించాము.అందులో భాగంగా
సాహితి బృందావన జాతీయ వేదికను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు, సేవలు, రచనలు చేస్తున్న  సాహితి బృందావన జాతీయ వేదిక
  వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీతను అన్నమయ్య సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసి
 ఈ అన్నమయ్య సాహిత్య పురస్కారం పత్రం, జ్ఞాపికను , అందించామని అన్నమయ్య సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీకృష్ణ, కార్యదర్శి రావినూతల భరద్వాజ, ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు సాహితీవేత్తలు,   కవయిత్రి నేల్లుట్ల సునీతకు అభినందనలు. శుభాకాంక్షలు తెలిపారు.
అన్నమయ్య సాహితి పురస్కారం అందుకోవడం చాలా  ఆనందంగా ఉందని సునీత తెలిపారు.
కామెంట్‌లు