సమర్థత! అచ్యుతుని రాజ్యశ్రీ

 గురువు గారు అన్నారు "మీస్వయంకృషితో తెలివితో ఒక నెలలోపల 10బంగారు నాణాలు సంపాదించితేవాలి.మీకు ఏమికావాలో అడగండి " సందీపుడు కోడిపుంజు ని అడిగి తీసుకున్నాడు.దిలీపుడికి కత్తి  ప్రదీపునికి పిల్లిని వారి ఇష్టప్రకారం గురువు ఇచ్చారు. సందీపుడు ఓపట్టణం చేరాడు.అక్కడంతా సోంబేరులు బద్ధకస్థులే! బారెడు పొద్దెక్కినా ఎవరూ లేవరు.కొత్వాలు  ఓమనిషిని నిద్రలేపటానికి నియమించాడు.కానీ వాడు బద్ధకస్తుడే! సందీపుడి కోడి పుంజు తెల్లారగానే కొక్కొరకో అని తెగ అరవటంతో జనమంతా లేచేశారు.కొత్వాలు బంగారు నాణాలు ఇచ్చి పుంజుని తీసుకున్నాడు. దిలీపుడు తన పదునైన కత్తితో  దారిలో తుప్పలు పొదలు నరికేస్తూ ఓగూడేలున్న ప్రాంతం కి చేరాడు.వారు అనాగరిక జీవితం చూసి దిలీపుడు అన్నాడు "ఈకత్తితో మీప్రాంతంని నేను బాగుచేస్తా.అడవిలో సేకరించిన కుంకుడు దుంపలు  తేనె ఆబాటపై వెళ్లి పొరుగు ప్రాంతాల్లో అమ్మండి" అని ప్రోత్సహించాడు.వారు అలాచేసి తమ దగ్గర ఉన్న నాణాలను అతనికి ఇచ్చారు. పిల్లితో బైలుదేరిన ప్రదీపుడు ఓచిన్న పట్టణం చేరాడు.అక్కడ ఎలుకలు క్రిమికీటకాల బాధ చూశాడు."నాపిల్లి ఎలుకలను సఫాచేస్తుంది" అని చెప్పి వారు ఇచ్చిన బంగారు నాణాలతో  బైలుదేరాడు.తన ముగ్గురు శిష్యులు  ప్రయోజకులై బంగారు నాణాలు ఒకనెల గడువు లో సంపాదించి తెచ్చినందుకు గురువు ఆనందించాడు.ఇదీ సమర్ధత అంటే🌸
కామెంట్‌లు