సైరికుండు.;-టి. వి. యెల్. గాయత్రి--పూణే మహారాష్ట్ర.
శ్రమకు రూపమీ భారత సైరికుండు
చెమట చిందించి బువ్వను సిద్ధ పరిచి
సీమ సీమల కందించి సేమ మొసగు
విమల చరితుని కిచ్చెద నమతు లెపుడు

సాగుభూమిలో పండించ సస్య రాశి
వేగు జామున లేచునీ వినయశీలి
మూగుచున్నను గష్టముల్ భోగి వోలె
సాగు చుండునీ ధీశాలి జగతికొఱకు.

దేవతగ నిల్చు రైతన్న దీప కళిక 
సేవ చేయుచు జాతికి సిరులు పంచు
భావితరముకు బంగారు బాట వేయు
పావనమూర్తికి నిత్తునే వందనంబు.
---------------------------


కామెంట్‌లు