సైన్సు టీచర్ పాఠంచెప్తూ"మనిషికి ముఖ్యంగా కావల్సినవేంటి?" అని అడగగానే పిల్లలంతా పొలోమని అరిచారు "రోటి కపడా ఔర్ మకాన్! ఆహారం వస్త్రాలు ఇల్లు "."మరి మనకు ఆహారం ఏంటీ? ఎలా వస్తుంది?""భూమి పై పంటలు పండిస్తే !""మనం ఆరోగ్యం గా ఉండాలి అంటే?" "మంచి ఆహారం కల్తీ లేనిది తినాలి.""శివా అరిచాడు "టీచర్!ఇప్పుడు అంతా కల్తీ ఆహారం! ఎరువులు ఎక్కువ వేసి పండిస్తున్నారు. విషంగా మారుతోంది. కల్తీ చేస్తున్నారు ఆహార పదార్థాలలో! రైతు ఎంత కష్టపడినా వర్షం వరదలు నీటి వసతిలేక భూసారం తగ్గిపోతోంది. పైరంతా నీటిపాలు అవుతోంది. " జనాభా పెరగటం ప్రకృతి బాధలతో ఆహార సమస్య పెరుగుతోంది. అందుకే చిరుధాన్యాలు తినాలి. ఈఆహారసమస్యకు పరిష్కారం చూపిన మహానుభావుడు ఎవరో తెలుసా?""ఉహూ!' "ఆయనే డాక్టర్ స్వామినాథన్! నోబెల్ బహుమతి గ్రహీత! హరితవిప్లవ పితామహుడు!7ఆగస్ట్ 1925లో కుంభకోణం లో పుట్టిన ఈయన కేంబ్రిడ్జ్ లో పి.హెచ్. డి.చేసి భారత్ కి తిరిగివచ్చి వరి గోధుమ లపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఇతర దేశాల వరి రకాలని మనదేశంలో వృద్ధి చేశాడు. 46 ప్రపంచ విశ్వవిద్యాలయాలు ఆయన్ని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.మరిమీరు కూడా కొత్త పరిశోధనలు చేసి మనదేశంలో ఆహార ఇతర సమస్యలకు పరిష్కారం కనుగొనాలి .సరేనా," తప్పకుండా టీచర్ అని పిల్లలు ఆనందంగా అరిచారు 🌹
ఆహారం!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి