రేపటికోసం తూరుపువేపు
పయనించే జీవితనౌక
వేకువ కోసం వెలుగులకోసం
పరుగులే జీవితమంతా!
చీకటి మాటున వెలుతురు
కష్టం వెనువెంటే సుఖాలు
చక్రభ్రమణమే బ్రతుకంతా
ఒకటి ముందైతే ఒకటి వెనుక
వెనుకకు తిరిగి అసలు చూసుకోక
గడచిన కలతల గతమే అది ఇక
రాబోయే రేపు తెచ్చేను
కమ్మని కలలకు రూపం
మార్పన్నది మనుగడ మూలం
మారనంటే ఒప్పదు కాలం
తలచనది దొరికినా
జరగనిది కోరినా
సమయమొచ్చు వేళకు
చేరిపోవు ఆవలి తీరం
ఆరాటం కెరటాలై
పోరాటం గమనమై
సాగే జీవిత పయనాన
ఎవరి ప్రాప్తమెంత వరకో!
కోరుకున్న మజిలీ చేర్చే మరో సుందర ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి