శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ —-
పచ్చైపరైత్తల్ - పెరియాళ్వార్ వంశస్తులు ఆండాళ్ కు పుట్టింటి సారె - పంచిన తరువాత , ఆండాళ్ వటపత్రశాయి సన్నిధిలో ఏకాంత తిరుమంజన సేవ తరువాత స్వామి వద్దవేంచేసి , విడైయాత్రకు సంబంధించిన అనుమతి పొంది , మార్గళి నోము నోచేందుకు బయలుదేరి , తిరుముక్కుళము వెళ్ళి , అక్కడ ఎణ్ణై కుళి వుత్సవము , కండరుళి , భోగిరోజు అక్కారవడిశల్ అందరికి పంచి , 30 పాసురముల విన్నపాదులు పూర్తి చేసుకొని, కనుమునాడు ప్రొద్దున్నే , ఏకాంతములో కనుము పుడి - ఆచరిస్తుంది. కనుము పుడికి పొంగలి, చక్కెరపొంగలి, దధిఓజనము, పుళిహోదర, ఎర్రసాదము - ( తెల్లసాదము, పసుపుసాదము, బెల్లం సాదము, ఎర్రసాదము , , తయిరుంజాదము) ఇవి పక్షులకు , అన్నదానము, రూపేణ, కాకీ పుడివైచ్చేన్, కనుము పుడివైచ్చేన్ , కాకాకుం కురువిక్కుం కళ్యాణం కళ్యాణం! “ అంటూ వాటికి మంగళములు పలికి , దీపారాధన చేసి , లక్ష్మి అష్టోత్తరంతో , వాటిని తాయారు ప్రసాదంగా అర్పించి , హారతి ఎర్రనీళ్ళ దృష్టి తీసి , ఆండాళ్ తను ఇంక రంగని చేరబోతున్నానన్న సంబరములో , అందరికీ , పంట పసుపుకొమ్ములు, చెరుకు, పళ్ళు , తాంబూలము, అద్దము , దువ్వెన , కాటుక , కుంకుమ , రవికల గుడ్డ, తాంబూలముగ
సమర్పించి , తనసన్నిధికి బయలుదేరుతుంది. అక్కడ ఇంకా కన్నయ్య తనను చేపట్టడానికి , రాలేదనే, బెంగతో , సాధారణ నూలు వస్త్రము ధరించి, ముత్తుక్కురి వుత్సవము, కండరుళుతుంది. (అనుగ్రహిస్తుంది)ముత్తుక్కురి వుత్సవములో, అరయర్ స్వామి , చాలా పాతకాలం నాటి పగడాలు ముత్యాలు, అతిచిన్నవి—- సన్న ఆవాలకంటే చిన్నవి—- ఒక మఖుమలు బట్టలో పరచి , వాటిని రెండు రెండుగా , జత పరుస్తూ, కూడిడు కూడలే పాసురాన్ని అభినయపూర్వకముగా , పాడుతూ , చివరి పగడాలు జతకలసిన పెరుమాళ్ళు కలుసితారనే, ఆనందంతో ఉప్పొంగి పోతుంది. ఒక్కోసారి కనుము సారె ఇప్పుడు పంచుకొంటుంది. తరువాత ఏంకాంతములో అలంకరణ సాయించుకొని, పురప్పాడల్ గా ఊంజల్ మండపము చేరి, ఠీవిగా వూయల లూగుతూ , ఆ సంవత్సరపు పంట ధాన్యాలను, అక్కడ చేరిన భక్తులకు పంచి పెడుతుంది . తరువాత మంగళ వాయిద్యములలో , తన ఆస్థానము ను చేరుకొంటుంది.
ఇది శ్రీవిల్లిపుత్తూర్ విశేషము!
మామూలుగ ఇతర దివ్య దేశ సన్నిధులలో , మన మన వూరి సన్నిధులలో , ఆయా కోవెల పిరాట్టి , ప్రత్యాకాలంకారముతో వేంచేపుచేసి , ముందు చెప్పిన రీతిలో కనుము పుడి పెడుతుంది. అర్చక స్వాములు పిరాట్టికి, కనుముపుడికి , హారతి ఇస్తారు. తరువాత భక్తులు( స్త్రీలందరి ) చేత కనుము పుడి పెట్టిస్తారు. ప్రతి ఒక్కరు అక్కడ చేరిన ముత్తైదువ లందరికీ తాంబూలము లిచ్చుకొంటారు! అందరికీ తాయారు తాంబూలమూ , అందుతుంది ! కనుము పుడి అయిన తరువాత , ఇంటి ఆడబడుచులందరూ, తమ పుట్టింటి క్షేమాన్ని కోరి , పంచాంగ ప్రణామములు చేస్తారు.
కొన్ని క్షేత్రాలలో తాయారు తోటలోకి వేంచేపు చేసి కనువుపుడి పెడుతుంది .
వూరిలో కన్నెపిల్లలు ముత్తైదువులందరూ చక్కగా అలంకరించుకొని , అందరి ఇళ్ళ కూ వెళ్ళి వారి కనువుపుడిని సేవించి , తాంబూలాలు స్వీకరిస్తారు! పట్టు లంగాల , చీరల రెప రెపలతో, చక్కని జడలు నాట్య మాడుతూవుంటే వయ్యారాల నడకలు నడుస్తూ , పక పక నగవుల పలకరింతలతో సరదాగా సందడిగా సాగుతుందీ కనువుపుడి!
వెనుకనున్న తత్వార్థము !
లీలా విభూతిలోని తిర్యక్ - జలచర , భూచర , ఖగ చర జీవులకూ , ప్రసాదమైన సాత్విక ఆహారాన్ని వితరణ చేసి, ఆత్మలమ్న్ంటికీ పుట్టిల్లైన వైకుంఠమును తలచుకొని , అక్కడి అతృప్తానందాన్ని గుర్తు చేసుకొంటూ, పరమాత్మతో చేరి ఆనందించే రోజు , ముందున్నాయని తలుస్తూ, ధర్మ బద్దంగా జీవన యానము సాగించడము . మనమందరము ఇక్కడి వారముకాదని, అక్కడి వారమేనని , గుర్తుతెచ్చుకొంటూ ఆనందంగా గడపడము !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి