రోజూ ఏదో ఒక బాధను వరమై అడిగిన కుంతీదేవి....ఎందుకని?
కురుక్షేత్ర పోరు ముగిసింది. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధంలో ధర్మం గెలిచింది. పాండవులు కౌరవులు పక్షాలలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా ధర్మం నెగ్గినందుకు అందరికీ ఆనందమే.
ఇందుకు కారణమైన కృష్ణుడు భారతయుద్ధం ముగిసాక తన ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే తన అత్త కుంతీదేవితో ఓ మాట చెప్పి వెళ్ళాలనుకున్నాడు కృష్ణుడు.
అప్పుడు కుంతీదేవి "కృష్ణా! మమ్మల్ని విడిచిపెట్టి పోతున్నావా? నిన్ను రోజూ చూసే భాగ్యం నాకిక లేదా?" అని బాధపడింది.
"ఈ భూమ్మీద ఏదీ స్థిరమైనది కాదు. కలిసున్నవారు విడిపోవడం, విడిపోయిన వారు కలిసిపోవడం వంటిదికూడా అలాంటిదే. నీ విచారం తొలగిపోయే రీతిలో నీకొక వరం ఇస్తాను. నీకేం కావాలో కోరుకో" అన్నాడు కృష్ణుడు.
కుంతీదేవితో కృష్ణుడు మాట్లాడుతున్న తరుణంలో పాండవులు, ద్రౌపది కూడా అక్కడున్నారు. కుంతీదేవి ఏ వరం కోరుతుందోనని వారు ఆత్రుతతో చూస్తున్నారు.
ఎలాగైనాసరే తన జీవితం సౌఖ్యంగా ఉండేటట్లు, ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు కుంతీదేవి వరం అడు గుతుందనే అక్కడున్న వారందరూ అనుకున్నారు
కానీ కుంతీదేవి అడిగిన వరం అందరినీ విస్తుపోయేలా చేసింది. పైగా ఆమెకు మతి గతి తప్పిందా అనుకుని కూడా ఉండొచ్చు. అవును...ఎందుకంటే కుంతీదేవి అడిగిన వరం అలా అన్పించేలా ఉంది.
"నాకు రోజూ ఓ బాధనివ్వు" అని ఎవరైనా భగవంతుడిని కోరితే వారి గురించి మరి వేరే విధంగా ఎలా అనుకుంటారు?
కృష్ణుడిని చూసి కుంతీదేవి ఆ మాటే అడిగింది.
"కృష్ణా! రోజూ నాకొక బాధనైనా ఇవ్వు" అంది.
అన్నీ తెలిసిన వాడైనప్పటికీ అక్కడున్న వారందరికీ కుంతీదేవి అలాటి వరాన్నెందుకు అడిగిందో అర్థమవాలని కుంతిని చూసి అడిగాడు కృష్ణుడు "అత్తా! అందరూ సంతోషంగా బతకాలి. సౌభాగ్యంతో ఉండాలి. నా పిల్లలు ఆరోగ్యవంతులై ఉండాలి....వంటి వరాలు అడుగుతారు.
కానీ నువ్వు రోజూ ఓ చిరు బాధనైనా ప్రసాదించమని అడుగుతున్నావేంటీ" అని అడిగాడు.
"ఈరోజు వరకూ నాకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా బాధ కలిగినా దుఃఖమొచ్చినా నేను నిన్నే తలుచుకునే దానిని. యుద్ధం కారణంగా ఇప్పటివరకూ నువ్వు నాతోనే ఉన్నావు. నిన్నే చూస్తుండటంతో నా బాధలూ దుఖాలూ అన్నీ పోయాయి. ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టి పోతానంటున్నావు. కనుక నేను నిన్ను తలవకుండా ఉండిపోతానేమోనన్న భయం నన్ను పట్టుకుంది. రోజూ ఏదో ఒక బాధ ఇస్తే ఆ కారణంగానైనా నిన్ను తలచి నన్ను నేను ఓదార్చుకుంటాను. కనుక నాకు బాధను వరమై ప్రసాదించు" అని చెప్పింది కుంతీదేవి.
నిజమే, ఆనందంతో ఉన్నప్పుడు ఆ ఆనందంలో భగవంతుడిని మరచిపోవడం సహజమే. దుఃఖమో బాధో అంటూ ఒకటుంటేనే అప్పుడప్పుడైనా భగవంతుడిని తలచి నమస్కరించుకుంటాం. మన మొర చెప్పుకుంటాం. ఒక్కొక్క బాధ ఓ అనుభవాన్నిస్తుంది. ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి, విజయం సాధించడానికి కావలసిన సూక్ష్మాన్ని మనిషి తెలుసుకుంటాడు. అంతేకాకుండా భగవంతుడితో మమేకమై చేసే ప్రార్థనతో బాధ మటుమాయమై ఆనందం కలుగుతుంది.
కృష్ణా!
నీ పాదపద్మాలకు శరణం శరణం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి