@ అందుకే.... !"
***
పదాలను ఒడుపుగా నాటి...
ఊహలకందని...
భావాలను పండిస్తాడు !
వాక్యాలకు అలంకారాలద్ది...
సహభాష్ అనిపిస్తాడు !!
అందుకే... వాడు
..... కవియై నాడు... !
******
* శిలాక్షరాలై......!*
****
కష్ట , సుఖాలను...
అనుభవించి... వడపోసిన
వాక్యాలవి.....,
అందుకే... శిలాక్షరాలై
తర - తరాలకూ...
నిలిచాయి... !
******
@ సంపత్తి @
**
సామాన్యుడు...
కావాలనుకుంటే...,
చక్రవర్తి కాగలడేమో...
గానీ.... కవి కాలేడు !
అది... జన్మ - జన్మ ల
సాధనా సంపత్తి... !!
ఆ శారదామాత కరుణతో
పొందిన ప్రాప్తి... !!
******
కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి