ఇది నిజంగా జరిగిన సంఘటన! రోజూ ఛత్రపతి శివాజీ కోటలోపలికి హిర్కానీ అనే ఆమెవచ్చి పాలు అమ్మేది.రోజూ కోట ద్వారం గుండా లోపలికి వెళ్లేది.ఆరోజు యధాప్రకారం సైనికులు కోట ద్వారం మూసేశారు.హిర్కానీ ఆలస్యంగా వచ్చింది. ఎంత బ్రతిమాలినా సైనికులు సమయం దాటిపోయిందని తలుపులు తీయలేదు. ఇంట్లో తన చిన్నారి కొడుకు ఉన్నాడు.అంతే పిల్లాడి కోసం ఆతల్లి చాలా కష్టమైన బురుజు మార్గంలో చీకట్లో నడిచి ఎలాగో ఇల్లు చేరింది. పట్టుబడితే శిక్షతప్పదు.కానీ మాతృప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది.ఈవిషయం తెలిసి శివాజీ కాపలావారిని మందలిస్తాడు.విచక్షణ తో ఆలోచించి ఆసమయానికి తగిన పని చేసితీరాలి.ఆహిర్కానీవెళ్లిన బురుజుకి ఆమె పేరు పెట్టారు.
అలాగే అమ్మా నాన్న లు అధ్యాపకులు పిల్లలని గమనిస్తూ సమయసందర్భంని బట్టి శిక్షించటం ఆదరించటం చేయాలి. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి