ద్వారకానాధ్ టాగూర్! అచ్యుతుని రాజ్యశ్రీ
 విశ్వకవి రవీంద్రుని తాత ద్వారకానాధ్ జీవితం చదివాక ఆనాటి సమాజ పోకడలు ఆయన జీవితంలోని విశేషాలు తెలిశాయి. వేణీసంహారం రాసిన భట్టునారాయణుని ఈఠాకూర్ వంశమూలపురుషునిగా భావిస్తారు. 1794లోద్వారకానాధ్ మేనక రామమణి దంపతులకు పుట్టారు. కానీ మేనక తన సొంత అక్కకి పిల్లలు లేకపోవడం తో ద్వారకాని దత్తత ఇవ్వడం జరిగింది. ఆమె పేరు అలకసుందరి.పిల్లాడికి ఇంట్లోనే బెంగాలీ సంస్కృతం అరబ్బీ పార్శీ భాషల్లో ట్యూషన్  ఏర్పాటుచేశారామె.పూజాపునస్కారాలు సాలిగ్రామపూజ ఇలా పగలంతా దైవప్రార్థన లో మునిగేది.కానీ వంట వార్పు పిల్లాడి ఆలన పాలన చూసేవారు.వితంతువు ఐన ఆమె ఆస్తి ఏడాదికి 30వేలరూపాయల ఆదాయం!తన 16వ ఏట ద్వారకా బడికి స్వస్తి పలకటం17వ ఏట దిగంబరీ అనే 9ఏళ్ళ పాపతో పెళ్లి ఓమలుపు.ఆపాపలో ఎంత దివ్యత్వం అంటే అమ్మవారు జగద్ధాత్రి బొమ్మను దసరాకి దిగంబరి పోలికలతో తయారు చేసేవారు పూజకై!!
అత్తగారి కన్నా మహామడి తడి ఆచారం తో భార్య 4గంటలకే లేచి గంగాస్నానం50సార్లు జపమాలతో నామజపం చేస్తే కానీ పాలు పళ్ళు తినని ఆమె తో అంత ప్రేమ ఆప్యాయత పొందలేదు ఆయన!
రాజారాం మోహన్ రాయ్ తో స్నేహం బెంగాలీ వారపత్రిక సంవాదకౌముది హరకారూ పత్రిక నిర్వహించిన ద్వారకా  బెంగాలీ భాష ఉన్నతికై చేసిన కృషి అమోఘం! ఇక 5గురు కొడుకులు పుట్టినా దిగంబరి వారి ఆలనాపాలనా తో పాటు తన పూజాపునస్కారాలు కొనసాగించడంతో  ఆయన తన దృష్టినంతా ఓడలవ్యాపారం పై కేంద్రీకరించాడాయన.తన జమీందారీ వ్యవహారం చూట్టానికి మంచి జీతాలిచ్చియూరోపియన్ మేనేజర్లను నియమించారు. ఈయనకొడుకు మహర్షి దేవేంద్రనాధ్ టాగూర్.1839లో 13ఏళ్ల కొడుకు చనిపోయిన మర్నాడే  భార్య మరణించటంతో కృంగిపోయిన ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.అప్పుడు ఆయన కేవలం 40ఏళ్ల వాడు. 
   తల్లి చావుబతుకులమధ్య ఉంది అని తెలిసి గుర్రపుబగ్గీ నావలో పయనిస్తూ కలకత్తా చేరిన ద్వారకా మనసు కలిచివేసిన సంఘటన జరిగింది. ఆమె చనిపోకముందే మూడు రోజులు  గంగానది ఒడ్డున గడ్డిపై పడుకోబెట్టారు.పైన పందిరి వేశారు. పవిత్ర గంగా నదిని చూస్తూ ఆమె చావాలని బంధువులు చేసిన పని అది.పాపం21ఏళ్ల  దేవేంద్ర  నిస్సహాయంగా బామ్మ మరణయాతనను చూశాడు. 
ఇది తెలుసుకున్న ద్వారకా నాధ్ కన్నీరు మున్నీరు ఐనారు.
తల్లి స్మృతి చిహ్నం గా డిస్ట్రిక్ట్ ఛారిటబుల్ సొసైటీ కి ఓలక్షరూపాయలు విరాళం ఇచ్చారు. పిల్లలతో కూడా సన్నిహితంగా మెలగలేదు .తండ్రి మిత్రులతో బిజీ గా ఉంటే పిల్లలు  దూరంగా  తొంగిచూసేవారు. అంతే!ఇక ఆయన లండన్ పారిస్ లమధ్య అలా తిరుగుతూ లండన్ లో తుదిశ్వాస వదిలిన  ద్వారకా నాధ్ ని కెన్సల్ గ్రొన్(లండన్) లో సమాధి చేయడం జరిగింది. 
ఇక వ్యాపారి గా డబ్బు బాగా సంపాదించినా దానధర్మాలు చేశారు. 1842లో విక్టోరియా మహారాణికి పట్టువస్త్రాలను బహూకరించాడు.మరీ మంచి మరీ చెడ్డ జమీందారు కాదు ఆయన. ఏదేమైనా రవీంద్ర నాధ్ టాగూర్ గా  మహర్షి దేవేంద్రనాధ్ తండ్రిగా చరిత్రలో నిలిచిపోయారు ద్వారకా నాధ్ టాగూర్ 🌺

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం