రజనీ తీరు;-- యామిజాల జగదీశ్
 ఇతరులలో చూడలేని ఓ భిన్నమైన వైఖరి నటుడు రజనీకాంత్ కు ఉంది.
సినిమా షూటింగ్ మధ్యలో అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడం మామూలే. ఇటువంటి సందర్భొలలో రజనీకాంత్ కూడా పాల్గొని జోకులు చెప్పి నవ్వడం చేస్తుంటారు. కానీ ఈ మాటలే హద్దుమీరుతున్నాయనుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు రజనీకాంత్.
ఒకరు లేని చోట వారి గురించి ఇతరులు తక్కువ చేసో లేక వారి గురించి అనవసరపు మాటలు చెప్పుకోవడం మొదలుపెట్టారో ఆయన అక్కడిక ఉండరు. 
కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా కూర్చీలో కూర్చుంటారు. కాస్సేపు వరకూ సహనం పాటిస్తారు, టాపిక్ మారుతుందేమోనని. అప్పటికీ అలాంటి మాటలు మారలేదనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్స్ క్యూజ్ మీ excuse me  అని.
ఎందుకిలా వెళ్ళిపోతుంటారని ఒకరడగగా అందుకు ఆయన కారణం చెప్పారు.
ఒకరు లేని చోట వారి గురించి కించపరచి మాట్లాడినా హేళన చేసినా లేక వారి గురించి అదోలా మాట్లాడినా నాకిష్టం ఉండదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ మాటలను ఆ వ్యక్తికి చెప్తారు. ఆ మిటలతో సంబంధిత వ్యక్తి మనస్సు ఎంతలా బాధపడుతుందో కదా? అటువంటి మాటలప్పుడు ఎవరెవరు పాలుపంచుకున్నారని ఆ వ్యక్తి అడిగి తెలుసుకుంటారు...వారి మధ్య నేనూ ఉన్నానని తెలిస్తే ఆ వ్యక్తి ఎంతలా బాధపడతారో కదా....కనుక నేను అనవసరపు ముచ్చట్లలో పాల్గొననని రజనీకాంత్ స్పష్టం చేశారు.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం