తెలిసీ - తెలియని
. పిల్లల్లారా....
అల్లరి పనులు
చెయ్యొద్దు... !
మితిమీరిన
మీ అల్లరితో...
అమ్మకు కోపం
తెప్పించొద్దు... !
బద్దకించక
ప్రొద్దునె లేచి
చక - చక తయారు
అవ్వాలి.... !
ఆలస్యము చేయక
ప్రతిరోజూ....
వేళకు బడికి
వెళ్ళాలి.... !
చదువులోనూ
ఆటల్లోనూ...
ఉత్సాహాన్ని
చూపాలి
తోటి పిల్లలతో...
తగవులు పడక...
స్నేహంగా.....
మెలగాలి !
పెద్దచదువులు...
చదవాలి... !
గొప్పవారిగా...
ఎదగాలి.... !
హాయిగా మీరు...
బ్రతకాలి.... !
తెలిసీ - తెలియని...
పిల్లలు మీరు....
అన్నీ తెలుసుకోవాలి !
జ్ఞానాన్ని పెంచుకోవాలి !!
మేధావులనిపించు కోవాలి.
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి