సుప్రభాత కవిత ; -బృంద
చీకట్లను తొలగిస్తూ
చిరు వెలుగులు ప్రసరిస్తూ
తోటలో ఆమని సొబగులు
అందంగా అద్దేస్తూ 

తూరుపు దిక్కును
ఎరుపెక్కిస్తూ....
కొండలనడుమ కొంచెం
కొంచెంగా పైకొస్తూ

చలిగాలికి వెచ్చదనం
క్రమంగా పెంచుతూ
అణువణువూ కాంతిపుంజాలు
ప్రభవిస్తూ  ...ప్రసరిస్తూ..

పువ్వు పువ్వునూ నవ్వులు
చిందేలా వికసింపచేస్తూ
సుమ గంధపు పరిమళాలు
భువినంతా నింపేస్తూ

పర్జన్యాలకు పసిడి 
మెరుగులు అద్దేస్తూ
పర్యావరణానికి
బంగరు పూత పూస్తూ

వెలుగుల వెల్ల వేసే
వెలుతురు పువ్వును
స్వాగతించే  శుభతరుణాన
పులకరించు పుష్పాలను

పలకరించు పరమాత్మునికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు