యవ్వనంలో
అతి పేదరికంలో ఉండీ
తన ప్రతిభతో
అంచెలంచెలుగా
ఎదిగిన గొప్ప కళాకారుడు
తన వశీకర గాత్రంతో
అభిమానుల మదిలో
సుస్థిర స్థానం సంపాదించుకున్న
కళాకారుడు
ఎదుగుతున్న దశలో
రోజూ శ్వేత రంగు దుస్తులనే
ధరించే అలవాటున్న
కళాకారుడు
ఓమారు
పత్రికా విలేకరులు
ఆయనను చూసి
"మీరెప్పుడూ తెల్ల రంగుదుస్తులను మాత్రమే ధరిస్తారు....
మీకు తెలుపంటే అంతిష్టమా" అని
ఆడిగినప్పుడు...
ఒకే ఒక్క రంగు దుస్తును
రోజూ ధరిస్తే
అతను ఒకే చొక్కాను
రోజూ వేసుకుంటాడు అని
చెప్తారు...
అలా కాకుండా
తెల్ల రంగు దుస్తులను ధరిస్తే
అతనెప్పుడూ
తెల్ల రంగు దుస్తులనే వేసుకుంటాడని
చెప్తారు...
అందుకే తెల్ల రంగు దుస్తులను ధరిస్తాను
వేరే రంగు దుస్తులైతే
తెలిసిపోతాయి
తెల్ల రంగైతే
తెలీదు....అని
ఎంతో వాస్తవంగా
జవాబిచ్చారు
అంతటి పేదరికంలోనూ
తన సంగీత జ్ఞానంతో
ప్రావీణ్యంతో
వృత్తిమీదున్న భక్తితో
అభిమానుల ఎదలో
చెరగపోని స్థానాన్ని పొంది
కీర్తిప్రతిష్ఠలతో శిఖరాగ్రాన్నందుకున్నారు
ఆయన
ఇంకెవరో కాదు
గౌరవనీయులైన
సినీ నేపథ్య గాయకుడు
కె. జె. జేసుదాస్
ఈరోజు ఆయన జన్మదినం
నాకెంతో ఇష్టమైన గాయక శిఖామణికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి