గోముఖ వ్యాఘ్రమ్ము -గోవు యొక్క ముఖం గల పెద్దపులి. (పైకి సాధువుగా కనిపించే క్రూరుడు).
2. ఘంటా పథం-మిక్కిలి వెడల్పైన రాజ మార్గము. (మార్గం విశాలంగా ఉంటే సులభం. గంటలతో కూడిన ఏనుగులు హాయిగా సంచరించే విశాల మార్గం).(ఘంటా పథం-పది బారలు వెడల్పు గల రాజమార్గం.
3. నిరక్షర కుక్షి-పొట్ట పొడిచిన అక్షరం లేనివాడు. (చదువు రానివాడు).
4 బక ధ్యానం-కొంగ జపం. పరులను మోసగించడానికి చేసే కృత్రిమ నటన. (కొంగ జపం చేస్తున్నట్లు వంటి కాలిపై కదలకుండా నీళ్లలో ఉంటుంది. అక్కడికి చేప పిల్లలు చేరగానే పుటుక్కున పట్టుకొని మింగేస్తుంది.) అవకాశం కోసం ఎదురుచూస్తూ కబళించే వారి పట్ల వాడబడే జాతీయం.
6 భగీరథ ప్రయత్నం-తన (పితరుల) పూర్వీకుల అస్థికలపై ఆకాశ గంగను ప్రవహింపజేసి, తరింప చేయడానికి భగీరధుడు అనేక విఘ్నాలను అధిగమించి సఫలుడైనాడు..(అందువల్ల గొప్ప ప్రయత్నాన్ని లేదా అమోఘమైన కార్య దీక్షను సూచించే జాతీయం.)
సంస్కృత జాతీయాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి