* చిత్రకవిత @ ఆహా... ప్రేమాభిమానాలు-- కోరాడ నరసింహా రావు !
  కలల పంటను చూసి.... 
     మురిసిపోతూ.... 
ప్రయోజకుడుకావాలని.... 
    మంచి పేరు తేవాలని... 
     కోటి ఆశలతో.... 
     ఎన్నెన్నో ఊహించుకుంటూ 
       కన్నతల్లి దండ్రులు 
  చెరోచేయీ పట్టుకుని.... 
   ఆనందంతో బడికి.... 
   తీసుకువెళ్లిన రోజులవి... !

ప్రేమానురాగాలమధ్య పెరిగి... 
  ఆ తల్లిదండ్రుల అవిశ్రాన్త శ్రమ తో  అంతటి ప్రయోజకుడై.... 
  తన స్వేచ్చకు, సుఖానికి, అభి వృద్ధికి, అడ్డు అని భావించి.... 
   అనాధాశ్రమాలకు ఆ వృద్ధ దంపతులను సాగనంపుతున్న రోజులివి.... !
.   ఆహా..... మాయమైపోతున్న 
  ప్రేమాభిమానాలు... !!
       ******

కామెంట్‌లు