సరదా కోసమే....!!;-- యామిజాల జగదీశ్
 భార్యలు భర్తను ఎందుకు కొడుతున్నారు తెలుసా?....ఇది కాస్సేపు నవ్వుకోవడానికే తప్ప సీరియస్సుగా తీసుకోకండి.....
భార్య : ఎందుకిలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఏమైందీ?
భర్త : నేనొస్తుంటే దారిలో ఒకడు నాతో గొడవ పెట్టుకుని నన్ను కొట్టడానికి తరుముకొస్తున్నాడే....
భార్య : మీరుండండి...నేను చూసుకుం టాను వాడి సంగతి.
భార్య : ఒరేయ్ ...ఎవడ్రా అది...నా మొగుడి మీద చెయ్యేసేది...మగాడై ఉంటే నాతో రారా....చూసుకుందాం నువ్వా నేనా అని. అడగడానికి ఎవరూ లేరనుకున్నార్రా...చెప్పు తెగుతుంది...
అటువైపు నుంచి ఏ జవాబు లేదు.
కాస్సేపు తర్వాత భార్యాభర్తలిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు.
ఏడుస్తున్న భర్త వంక చూసింది.
భార్య : ఎందుకేడుస్తున్నారూ? ఏమైందీ?
భర్త : అది కాదమ్మా....ఇన్ని రోజులుగా నువ్వు నన్ను కొడుతున్నప్పుడల్లా నిన్ను నేను ఓ శత్రువుగా చూశాను. కానీ ఇప్పుడు నీకు నామీదున్న ప్రేమ అర్థమైందే.
భార్య : అవునండీ...మిమ్మల్ని కొట్టాలని మాకేమన్నా ఆశనుకున్నారా....స్త్రీలైన మేము సమస్యంటూ వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికే అప్పుడప్పుడూ భర్తలను కొట్టి రిహార్సల్ చూసుకుంటాం. అంతేతప్ప మేమెందుకు పరాయి మగాడిని కొడతాం. కోపమున్న చోటేనండీ ప్రేమాభిమానాలుంటాయి.  ఇది అర్థం చేసుకోకుండా భార్య అంటేనే కొట్టడానికే పుట్టినట్టు మీ మగాళ్ళు అనుకుంటున్నారు. అలాగైతే ఎలా చెప్పండీ ....???🥲😪😄

కామెంట్‌లు