సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-23
ఋజు మార్గేణ సిధ్యతి న్యాయము
*****
ఋజు మార్గం అంటే తిన్ననైన లేదా సూటియైన లేదా సవ్యమైన, అనుకూలమైన దారి అని అర్థం.సిధ్యతి అంటే ఈడేరుట లేదా నెరవేరుట అని అర్థం.
తేలికగా అయ్యే లేదా అవ్వాల్సిన పనిని కష్టమయ్యేలా  చేసుకోవడాన్ని ఉద్దేశించి "ఋజు మార్గేణ సిధ్యతి"  న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు
ఈ న్యాయానికి సరైన సామెతను ఒక్కమాటలో చెప్పాలంటే గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అన్నమాట.
అంటే చిన్న పనికి రాని మొక్కను గోటితో పెరికేస్తే పోయేదాన్ని పెద్ద వృక్షమై పెరిగేదాకా చూసి గొడ్డలితో నరకడం లాంటిదే ఇది.
చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని దాన్ని పరిష్కరించుకోవడంలో తల పట్టుకునే వారు కొందరైతే సవ్యమైన దారిలో ఋజు మార్గంలో వెళ్ళకుండా త్వరగా పూర్తి కావాలనే ఆరాటంతో పనికి పని పెంచుకునే వాళ్ళు, అడ్డదారిలో వెళ్ళి అనేక ఇబ్బందులను కొని తెచ్చుకొనే వాళ్ళు మరికొందరు. 
దీనికే మరో సామెత చెబుతుంటారు."ముక్కేదంటే సూటిగా చూపకుండా తల చుట్టూ చెయ్యి తిప్పి చూపెట్టడం."అలాగే చిన్న చిరుగు పడినప్పుడు దానికి ఓ కుట్టు వేస్తే సమస్య తీరుతుంది కానీ పెద్దదిగా అయ్యాక బాధ పడుతూ సరి చేసుకోవడం.ఇలా "ఋజు మార్గేణ సిధ్యతి న్యాయమునకు" అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
 ఏ సమస్య, పని అయినా సూటిగా ,సవ్యంగా నెరవేర్చుకోకుండా  కష్టాలు కొని తెచ్చుకునే వారికి ఈ ఋజు మార్గేణ సిధ్యతి న్యాయము సరిగా సరిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం