🌹 న్యాయాలు- 1🌹
అంకుశ న్యాయం
******
అంకుశం అంటే ఏనుగు కుంభస్థలమును పొడిచే సాధనం.
మావటి ఎంత పెద్దదైనా, మదించిన ఏనుగునైనా సరే అంకుశంతో భయపెడుతూ, తన ఆధీనంలో ఉంచుకోవటం చూస్తూ ఉంటాం. చెప్పినట్లు చేసేలా శిక్షణ ఇచ్చి, దానితో పనులు చేయిస్తూ ఉంటాడు.
మనిషి బుద్ధి బలం ఎంత గొప్పదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అంత పెద్ద జంతువును చిన్న అంకుశంతో వశ పరచుకోవడం మామూలు విషయం కాదు, అందుకే "అంకుశ న్యాయం" అనేది వాడుకలోకి వచ్చింది.
*****
ఇలాంటి సంస్కృత న్యాయాలను మనకంటే ముందు తరం వాళ్ళు, పండితులు కావ్యాలలో, వాడుకలో ఉపయోగించారనే విషయాలు ప్రముఖ సాహితీవేత్త అయిన శ్రీయుతులు రెంటాల గోపాలకృష్ణ గారు "జాతీయాలు పుట్టు పూర్వోత్తరాలు మరియు సంస్కృత న్యాయాలు" అనే పుస్తకంలో రాశారు. వాటితో పాటు "శబ్దార్ధ దీపిక " తెలుగు నిఘంటువు నుండి సేకరించిన మరికొన్ని న్యాయాలను మీకు పరిచయం చేయబోతున్నాను.సహృదయతతో ఆదరించాలని కోరుకుంటూ...
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి