ఆ మూడూ మరవకు;-- యామిజాల జగదీశ్
ఓ మంచి మనసున్న ఆ తండ్రి తన కొడుకుతో ఇలా చెప్పాడు...
"ఒరేయ్ పుత్రా! నీ జీవితంలో మూడు నేను చెప్పే ఈ విషయాలూ మరచిపోకు. ఎట్టి పరిస్థితిలోనూ వీటిని విడవకు..." అని.
అవి, 
మంచి ఆహారాన్ని తినడం! 
మంచి చోట పడుకోవడం! 
గొప్ప ఇంట్లో జీవించడం!
ఈ మాటలన్నీ విన్న కుమారుడు అడిగాడు...
"మనం పేదవాళ్ళం. నేనెలా మీరు చెప్పినవి పాటించగలను?" అని.
అప్పుడా తండ్రి ఇలా చెప్పాడు...
ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటే చాలు. అప్పుడు ఏదైతే తింటున్నావో అదే శ్రేష్టమైన ఆహారం!
ఒళ్ళు వంచి శ్రమించాలి. అలసటతో నిద్రపోవాలి. ఆ పడుకున్న చోటే మెత్తటి పరుపు! నిద్ర సుఖమెరుగదు!
ప్రజలతో ప్రేమతో మెలగాలి. వారి హృదయాలలో స్థానం సంపాదించాలి. అప్పుడదే నువ్వు ఉంటున్న గొప్ప ఇల్లు!
 

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం