సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -9
ఆమ్ర వన న్యాయము
  ******
 ఆమ్రము అంటే మామిడి.ఆమ్ర వనము అంటే మామిడి తోట లేదా మామిడి చెట్లతో నిండిన అడవి.
మరి ఆ ఆమ్ర వనములో  మామిడి చెట్లు మాత్రమే ఉండాలి.కానీ ఆ తోటలో అనేక రకాల చెట్లు,పండ్ల చెట్లు,ఒకటో రెండో మాత్రమే మామిడి చెట్లు ఉన్నాయి.అయినా ఆ తోటను మామిడి తోట అని పిలవడాన్ని ఆమ్ర వన న్యాయము అంటారు.
పండ్ల చెట్లలో మామిడి చెట్టుకు శుభ కార్యాల్లోనూ, ఇష్టంగా తినే పండ్లుగానూ,పచ్చళ్ళుగానూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అందుకే మామిడి పండును పండ్లలో మహారాజుగా చెబుతాం.
 ఆ విధంగా కుటుంబంలో కానీ, వంశంలో కానీ ఎవరైనా ఒకరు మంచి పేరూ,హోదా కలిగి ఉన్నట్లైతే ఆ కుటుంబానికి, వంశానికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది.
అలా వారిలో ఎంతమంది, ఎలాంటి వారు ఉన్నా, ఆ ఒక్క వ్యక్తితోనే ఆ కుటుంబానికీ,వంశానికీ దీనిని అంతటికీ పేరు,ప్రఖ్యాతులు రావడం చూస్తుంటాం.
ఈ న్యాయానికి ఉదాహరణగా "కులములోన ఒకడు గుణవంతు డుండిన/కులము వెలయు వాని గుణము చేత..."అనే వేమన పద్యం సరిగా సరిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు