కులం!!!?- ప్రతాప్ కౌటిళ్యా
కులం వివాదం కాదు
ఒక వేదం!!?

కులం లేకుంటే
తక్కువ చూపు కాదు
చూపే లేకుండా పోతుంది!!?

కులం జూదం కాదు
యుద్ధంలో ఆయుధం!!

కులం నీ చేతిలో కలం
కులం నీ చేతిలో కత్తి!!

కులం నీకు మరణాన్ని
మరణం తర్వాత జీవితాన్ని ఇస్తుంది!!?

ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత
కులం లేకుంటే
ఏమీ లేకుండా పోతుంది!!?

తల్లిదండ్రులు ఇచ్చిన
ఆస్తిపాస్తులతోపాటు
కులం కూడా ఒకటి!!!

నీతో కోట్లు లేకున్నా
కులం నోట్లో మాట ఉంటే చాలు!!!

ఆకాశానికి నిచ్చెన వేసేది కులం
అవకాశాలను ఇచ్చేది కులం!!

కులం కాలాన్ని ఓడిస్తుంది
కులం ఉంటే మంచి కాలం ఉన్నట్లే!!?

కులం లేని వాళ్లకోసం అంకితం

కామెంట్‌లు
ప్రసాద్ చెప్పారు…
నేటి సమాజంలో కులం అనేది కొన్ని అవసరాల కోసం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున
ఎంతో మంది మేధావులకు చెంపపెట్టు మీ రచన ఇంకా ఎన్నో
సమాజానికి ఉపయగపడే రచనలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ప్రసాద్
గుడివాడ
సెల్ 9493657333
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం