శివా అమ్మ నాన్నకు తాము బీదవారం అని కొడుకు గొప్ప వాడు అవుతాడా లేదా అనే చింత పీడిస్తూ ఉండేది. తను పనిచేసే ఆపండితుని దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడు తండ్రి. ఆయన ఓకథ చెప్పారు "రామం!ఇదివిను.ఓ గురువు గారు ముగ్గురు శిష్యులను నీరు తెమ్మని పంపారు .మొదటివాడు బురద ఆకు అలములున్న నీరు తెచ్చి "గురూజీ!మీకు ఆలస్యం అవుతుంది అని వెంటనే నీరు తెచ్చాను" అన్నాడు. రెండోవాడు కాస్త ఆలస్యంగా కొద్దితేటగా ఉన్న నీరు తెచ్చాడు. శుభ్రంగా లేవని చిల్లగింజ వేశాడు. మూడోవాడు మూడు కి.మీ.నడిచి కొండపై నుంచి జలజలా పారే సెలయేటి నీవు తెచ్చాడు. శుభ్రంగా తీయగా ఉంది ఆనీరు.ఆమూడోవాడికి సహనం ఎక్కువ అందుకే అతనిపై నాకు నమ్మకం. మొదటి ఇద్దరు ఎలాగోలా పనిఐపోతే చాలు అనుకుంటారు." రామం! మీ ఆత్రుత టెన్షన్ తో శివా ని ఒత్తిడిచేస్తే ర్యాంకు మార్కులు అని పొద్దుగూకులూ వెంటపడితే వాడు శారీరకంగా అలసిపోయి మానసికంగా దెబ్బ తింటాడు.చదివింది మర్చి పోతాడు.శివా కి ధైర్యం సకారాత్మక మాటలతో ప్రోత్సహిస్తూ దైవం పై భారం వేయండి. " అంతే శివా ఇప్పుడు హాయిగా సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుతూ అన్ని గుర్తు ఉంచుకుంటున్నాడు.🌷
సకారాత్మకం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి