నేనూ వ్యాపారినే;-- యామిజాల జగదీశ్
 ప్యూన్ పనైనా ఇస్తారాని అడిగాను.
అబ్బే కనీసం పదో తరగతైనా చదివుండాలన్నారు ఓ సంస్థవారు.
వాచ్ మాన్ గా నైనా తీసుకోండి అని అడిగాను.
ఆబ్బే ఎనిమిదో తరగతైనా చదివుండాలన్నారు.
కాఫీ టీ కొట్లో పని కోసం అడిగాను.
అబ్బే అయిదో తరగతైనా చదివుండాలన్నారు.
రాయడం చదవడం తెలీకుంటే రేపు జీతం అందుకున్నప్పుడు ఎలా సంతకం చేస్తావని పొమ్మన్నారు.
దేనికీ పనికిరానని అందరూ ఏదో ఒకటి చెప్పి వెనక్కు పంపేయడంతో ఓ నిర్ణయానికి వచ్చాను.
ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. చేస్తున్నాను. బాగానే ఉన్నా....నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని పంపించేసిన వారందరికీ కృతజ్ఞతలు. మీరందరూ నన్ను పొమ్మనడంవల్లే ఈరోజు ఇలా హాయిగా వ్యాపారం చేస్తున్నాను. ఇల్లు నడిపిస్తున్నా!! అన్నాడో వ్యాపారి.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం