అంధకర దీపికా న్యాయము-3
*******
అంధుడు అంటే గుడ్డివాడు.కరము అంటే చేయి. దీపికా అంటే దీపము.
అంధుడైన వ్యక్తి చేతిలో వెలుగుతున్న దీపం ఉన్నప్పటికీ గుడ్డితనం వల్ల ఆ దీపం వల్ల వచ్చే కాంతిని చూడలేడు. ఏ విధంగానూ ఆ దీపం ఉపయోగపడదు.దీనినే అంధకర దీపికా న్యాయము లేదా అంధ దీపికా న్యాయము అని అంటారు.
అలాగే చదువు రాని వ్యక్తి చేతిలో ఎంత విలువైన పుస్తకం పట్టుకుని తిరిగినా అతనికి దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.అందులోని గొప్ప తనం తెలియదు కదా!.
దీనిని ఇలా కూడా చెప్పవచ్చు చెవిటి వాడి ముందు శంఖం ఊదినా, శ్రావ్యమైన సంగీతం వినిపించినా,లోభి వాడి దగ్గర ఎంత ధనం ఉన్నా అతడికి ఎలాంటి ఫలితం, ఉపయోగం ఉండదు.కాబట్టి ఇలాంటి దృష్టాంతాలను అంధకర దీపికా న్యాయమునకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి