తే.గీ.
గింజ పండక రైతన్న గింజుకొనగ
ధరలు చుక్కల పైకెక్కి
దాగుకొనగ
వసుధ సొమ్ములు మృగ్యమై
వాడిపోగ!
కలత పెట్టుచునుండె సంక్రాంతిశోభ!
----------------------------------------
శంకరాభరణం-సమస్యాపూరణం
-----------------------------------
ఉ.
చిక్కదు క్షీరమీయ దరి
జేరదు రక్కును గోళ్ళతో,సదా
పక్కను వీడిరాదు తనవాలము
నూపుచుపైకిదూకియున్
పిక్కను పట్టిముక్కలను
పీకును,ప్రాకును "దండమయ్య!మీ
కుక్కను సైపలేననుచు" యుగ్మలి చేరెను పుట్టినింటికిన్
---------------------------------------
భావనప్రియ-సమస్యాపూరణ;-కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి