శాంతి సందేశాలు అందించిన సాహితీ బృందావనం జాతీయ వేదిక కవులు






 సాహితీ బృందావన విహార జాతీయ వేదిక ఉమెన్స్ రైటర్స్ మరియు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక మండలి తెలంగాణ సాహిత్య అకాడమీ సారధ్యంలో మరియు కవి యాత్ర వ్యవస్థాపకులు కారం శంకర్ నివేదిక గార్ల ఆధ్వర్యంలో శ్రీమతి నెల్లుట్ల సునీత సారధ్యంలో ఇతర సాహితి సంస్థల నుండి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గన్ పార్క్ లోనే అమరవీరుల స్మారక స్థూపం నుండి రవీంద్ర భారతి మీదుగా చారిత్రక గోల్కొండ వరకు.సాగింది. శాంతి, జ్ఞానం, ప్రేమ, అనే అంశాలపై సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు ఉమెన్స్ రైటర్స్ రచయిత్రుల, కవుల బృందాలు సమైక్యతతో, సమరసత భావంతో శాంతి సందేశాలతో  కవితపఠనం చేసి అందరిని అలరించి,  ఆకట్టుకుని, పలువురి ప్రశంసలు పొందారు.   శ్రీమతి నెల్లుట్ల సునీత రూపొందించిన  తెలుగు నూతన ప్రక్రియ సున్నితం సరళ శతకంలో సున్నితం కవుల
 శ్రీ కవిత వెంకటేశ్వర్లు  రచించిన పరిమళించిన కవిత అంతరంగాలు అనే గ్రంథం మరియు శ్రీమతి మెరుగు అనురాధ రచించిన అనురాగ వీచికలు అనే రెండు గ్రంధాలను రవీంద్రభారతిలో శ్రీ మామిడి హరికృష్ణ  ఆవిష్కరించి పుస్తక రచయితలను మామిడి హరికృష్ణ  సన్మానించారు. నాగేశ్వరం శంకరం దేశపతి శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలరీ గౌరీ శంకర్, అమ్మంగి వేణుగోపాల్, వ్యాఖ్యాతలు బి వెంకట్ దక్షిణామూర్తి, పాల్గొని శాంతి గురించి ప్రసంగించారు.  ఈ రెండు వేదికల నుండి కవి యాత్రలో భాగస్వాములైన తంగెళ్ళపల్లి ఆనందాచారి, పోర్ల వేణుగోపాల్ కవిత వెంకటేశ్వర్లు, సయ్యద్ జహీర్ అహ్మద్, లోడే రాములు, కల్లి పిల్లి ఆకాష్, నెల్లుట్ల.సునీత పాల్గొన్నారు. ఉమెన్స్ రైటర్స్ నుంచి ఎడ్ల లక్ష్మి డాక్టర్ బృందా, మచ్చ అనురాధ, వేముల ప్రమీల ఉమామహేశ్వరి మెరుగు అనురాధ,ఎడ్ల లక్ష్మి, గాడే పల్లి సూర్యకాంతి, యాళ్ల ఉమామహేశ్వరి,తదితరులు
పాల్గొని కవిత గానం చేసి అందరి ప్రశంసలు పొందారని రెండు సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత తెలిపారు. పుస్తక రచయితలకు శుభాకాంక్షలు తెలిపారు. కవి యాత్రలో పాల్గొన్న కవయిత్రులను, కవులను అభినందించారు. కవి యాత్రలో అవకాశం కల్పించిన కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకారం శంకర్ నివేదిత దంపతులకు, కన్వీనర్ అయినంపూడి శ్రీలక్ష్మి కి ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఈ ప్రేమ, జ్ఞానం, శాంతి లక్ష్యంగా సాగిన కవియాత్రలో నేను కూడా పాలుపంచుకోవడం చాలా సంతోషం.. నిర్వాహకులకు ధన్యవాదాలు.🙏🏿🤝. ✍️లోడె రాములు