నేతాజీ నాటి కరెన్సీ నోటు;-- యామిజాల జగదీశ్
 కనైలాల్ బసు పుస్తకం 'నేతాజీ: రీడిస్కవర్డ్' మేరకు, బ్రిటీష్ వారిపై యుద్ధం నిమిత్తం నిధులు సమకూర్చే ఉద్దేశ్యంతో 1944 ఏప్రిల్లో బర్మా (ఇప్పుడు మయన్మార్) లోని రంగూన్ (ఇప్పుడు యాంగోన్) లో ఆజాద్ హింద్ బ్యాంక్ ఏర్పడింది.  ఈ బ్యాంక్ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల నుంచి ఈ బ్యాంక్ నిధులను సేకరించింది.
1980వ దశకంలో, రాష్ట్ర నీటిపారుదల శాఖలో రిటైర్డ్ కాంట్రాక్టర్ అయిన రామ్ కిషోర్ దూబే తన తాతగారి రామాయణం పుస్తకంలో ఉన్న ఈ కరెన్సీ నోటుని చూశారు. కానీ ఆయన దీని చారిత్రక ప్రాముఖ్యతను చాలాకాలం వరకూ గుర్తించలేదు.
"మా తాత, ప్రాగీలాల్, నేతాజీ కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేశారు. ఆయన 1958లో మరణించారు" అని దూబే చెప్పారు.
“ఆయన నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండేవారు. లక్ష్మీస్వామినాథన్ నేతృత్వంలోని ఝాన్సీ రాణి రెజిమెంట్ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం రహస్యంగా పనిచేశారు. ఆయన సైన్యం కోసం తన భూమిని వదులుకున్నారు. అయనకు ఈ నోటుని నేతాజీ బహుమతిగా ఇచ్చారు.
దూబే కనుగొన్న ఈ లక్ష రూపాయల కరెన్సీ నోటులో ఎడమవైపు బోస్ ఫోటో, మరొక వైపు హిందీలో “స్వతంత్ర భారత్” అని రాసి ఉంది. భారత భూభాగం ( స్వాతంత్ర్యానికి పూర్వం) మ్యాప్ కూడా ఈ నోట్లో ముద్రించారు. నోటు మధ్యలో "జై హింద్" అనే మాటలు ఆంగ్లంలో ఉన్నాయి. 
నోటు పైన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాల శ్రేణి "బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్" అని, దిగువన "శుభాకాంక్షలు" అని రాసి ఉంది.
ఇలాంటి అరుదైన నోట్ లను చూడాలనుకునే వారి కోసం, ఒడిశాలోని కటక్‌లోని "నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంలో చూడవచ్చు. ఆజాద్ హింద్ బ్యాంక్ జారీ చేసిన నాణాలు, కరెన్సీ నోట్లను ఇక్కడ భద్రపరిచారు.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం